4 వందలకే సిలెండర్ కావాలంటే కేసిఆర్ నీ గెలిపించండి: ఎఫ్డిసి చైర్మన్ వంటేరు
తూప్రాన్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : ముఖ్యమంత్రి కెసిఆర్ నీ మూడోసారి గెలిపిస్తే 400 రూపాయలకే సిలిండర్ 5000 రూపాయల వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి తెలిపారు, తూప్రాన్ మండలంలోని ఇమాంపూర్ , ఘణపూర్ గ్రామాలలో సాయంత్రం రోడ్ షో నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రం ఇవ్వడం లేదని ముఖ్యమంత్రిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎక్కడికెళ్లిన అద్భుతమైన స్పందన వస్తుంది కారు సర్కారు కేసీఆర్ అని స్పందన వస్తుందన్నారు బిజెపి ప్రభుత్వం వస్తే ఇప్పుడున్న రేట్లు డబుల్ రేట్లు అవుతాయని విమర్శించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బాబుల్ రెడ్డి, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి,ఎంపీపీ గడ్డి స్వప్న వెంకటేష్ యాదవ్ ,జెడ్పిటిసి రాణి సత్యనారాయణ గౌడ్, భాస్కర్ రెడ్డి ,సర్పంచ్ లు మిద్దిoటి పుష్ప నవీన్, గుర్రం ఏల్లం, మండల ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, ఉప సర్పంచ్ ఆకుల రవి , రెండు గ్రామల వర్డు సభ్యులు, గ్రామ పెద్దలు, సంఘాల నాయకులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, యువకులు, మహిళాలు, గ్రామ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

0 Comments