బిఆర్ఎస్ లో చేరికలు
మనోహరబాద్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి : ప్రభుత్వo చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి బి ఆర్ ఎస్ లో చేరుతున్నారని మనోహరబాద్ మండల అధ్యక్షుడు పురం మహేశ్వర్ అగ్రరం గ్రామ అనుబంధ గ్రామస్తుల ఓటర్లు దమ్మకపల్లి గ్రామస్తులు ఆదివారం టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు, గ్రామానికి చెందిన స్వామి ముదిరాజ్, సర్పంచ్ రేణుక ఆంజనేయులు సహకారంతో మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో 60 మంది పార్టీలు చేరి కారు గుర్తుకు ఓటు వేసి గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ ను మూడవసారి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందని వెల్లడించారు, పార్టీలో చేరిన మాజీ వార్డు సభ్యులు చిల్ల స్వామి, మన్నె రాజు, మల్లేష్, మన్నే ముత్యాలు, రాజు, భగవంతు, శశికళ, మాధవి, నరసింహులు, సురేష్, వీరిని మండల వైస్ ఎంపీపీ విట్టల్ రెడ్డి పార్టీలోకి సాదరంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు, ఈ కార్యక్రమంలో వైసిపి విట్టల్ రెడ్డి, సర్పంచ్ రేణుక ఆంజనేయులు, అగ్రహారం గ్రామ అధ్యక్షుడు నీలగిరి, దనాగిరి, ప్రభాకర్ ,రవి, తదితరులు పాల్గొన్నారు.

0 Comments