ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం : జెడ్పీ చైర్మన్ హేమలత గౌడ్
మనోహరబాద్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ను మూడోసారి గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిపించాలని జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, రాష్ట్ర మాజీ టూరిజం శాఖ చైర్మన్ భూపతిరెడ్డి, రాష్ట్ర మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పురం మహేశ్వర్, పిఎసిఎస్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి, వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి లు తెలిపారు అన్ని వర్గాలకు భరోసా ఇచ్చే నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని గజ్వేల్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారని మూడోసారి ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు మనోహరాబాద్ మండలంలోని రామయపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వారు మాట్లాడారు కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పనులు దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు జరగలేదని అన్నారు కొత్త గవర్నమెంట్ రాగానే బీసీ బందు గృహలక్ష్మి పథకాలు అందరికీ అమలయ్యేలా చూస్తానని వారు హామీ ఇచ్చారు దేశంలో నే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కుతుందని మూడవసారి గెలిపించాలన్నారు . ఈ సందర్బంగా వారు ముఖ్యమంత్రి కెసిఆర్ ను మూడో సారి గెలిపించాలని ఓటర్లను అర్జీంచారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం పని చేసే ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం లో వృద్దులకు, , ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, పెన్షన్లు 3000 ఇస్తామని అన్నారు అత్యధిక పెన్షన్లు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ అని అన్నారు. కల్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా ద్వారా అనేక మంది ప్రజలు సంక్షేమం ను పొందుతున్నారని అన్నారు..కెసిఆర్ పెద్ద కొడుకులా సేవ చేస్తున్నందున మా కొడుకును మేం గెలుపించుకుంటామని గృహలక్ష్మి బిసి బంధు దళిత బంధు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కావాలని ప్రజలు అడగగా ప్రభుత్వం ఏర్పడ్డాక ఇస్తామని వారు తెలిపారు, వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,సర్పంచ్ నాగ భూషణం, మన్నే దర్మెందర్, పురం రవి, పెంటా గౌడ్, కల్లకల్ ఉప సర్పంచ్ రాజు యాదవ్ ,పాండు టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ రాహుల్ రెడ్డి, జావేద్ పాషా , మల్లేష్, ఆత్మ డైరెక్టర్, బిక్షపతి, రతన్ లాల్,మండల మైనార్టీ నాయకులు జావిద్ పాషా , అదిల్ తదితరులు పాల్గొన్నారు.



0 Comments