అన్ని వర్గాల చూపు కాంగ్రెస్ వైపే: మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి
మనోహరబాద్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కాళ్ళకల్ గ్రామంలో గజ్వేల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి తో పాటు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ తూముకుంట ఆంక్ష రెడ్డి పాల్గొని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మనోహరబాద్ మండల అధ్యక్షుడు జూపల్లి మల్లారెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తో కలిసి ప్రచారంలో పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు తామే ఎమ్మెల్యే అభ్యర్థిగా భావించి శ్రమించాల్సిన అవసరం ఉందని,ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రతి ఓటరుకు,గడప గడప కు ప్రజల లోకి తీసుకుని పోవాలని దిశ నిర్దేశం చేశారు... తెలంగాణ కాంగ్రెస్ అభయహస్తం 6 గ్యారంటీ పథకాలను ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, యువ వికాసం, మహాలక్ష్మి, గృహాజ్యోతి,చేయూత,ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ,500 రూపాయల గ్యాస్ సిలిండర్ తదితర పథకాలను ఇతర సంక్షేమ పథకాలను,కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకులు సైనికుడిగా పనీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


0 Comments