*వెంకటాపురం మండలంలో బిజెపి పార్టీలో చేరికలు*
వాస్తవ తెలంగాణ ప్రతినిధి (నుగూరు)వెంకటాపురం అక్టోబర్ 15,
ఆదివారం ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో శివపురం కాలనీలో చిట్టెం ఈశ్వరరావు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ యొక్క సమావేశంలో భారతదేశంలో ప్రధాన మంత్రి మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై సుమారు 20 కుటుంబాలు, భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరి సతీష్ కుమార్ ఎంపీపీ చేతుల మీదుగా కండవాలు కప్పి భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ చెరుకూరు సతీష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారికి రావడం ఖాయమని భద్రాచలం నియోజకవర్గం లో భద్రాచలం నియోజకవర్గం ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపియడానికి సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడుతున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఏనాడు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు సేవ చేసింది ఏమీ లేదని ఒకరు భద్రాచలంలోని ఇంటికి పరిమితం అయితే మరొకరు హాస్పిటల్ కి పరిమితం అయ్యారని ఏనాడు ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై పోరాడింది లేదని ప్రజలకు సేవ చేసింది ఏమీ లేదని కొట్లాడి నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేసేది ఏమీ లేదని వీరి వల్ల ఒరిగేది ఏమీ లేదని భారతీయ జనతా పార్టీ భద్రాచలం నియోజకవర్గం రాములు వారికి సేవ చేయాలన్న ఆకాంక్షతో కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు భావిస్తున్నారు కావున ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని భద్రాచల నియోజకవర్గంలో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రవి, చిట్టెం ఈశ్వరరావు, తాటి, నాగమ్మ, రొడ్డ బోసు,రాజు, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

0 Comments