ఘనంగా చేవెళ్ల బిజెపి నేత వర్రీ తులసి రామ్ విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు
శంకర్పల్లి వాస్తవ తెలంగాణ న్యూస్:
చేవెళ్ల నియోజకవర్గ బిజెపి సీనియర్ నేత వర్రీ తులసి రామ్ విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు పట్టణ శివారులో అంగరంగ వైభవంగా జరిగాయి. పుట్టినరోజు వేడుకలకు నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, నవాబుపేట్ మండలాల పార్టీ అధ్యక్షులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాయకులంతా కలిసి వర్రీ తులసి రామ్ విజయ్ కుమార్ ను గజమాలతో సన్మానించి, ఆయనతో కేక్ కట్ చేయించి బర్త్డే విషెస్ చెప్పారు. అధిక సంఖ్యలో బిజెపి అభిమానులు హాజరవడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్కరికి పేరుపేరునా విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

0 Comments