భారీ మెజారిటీ అందించిన బూత్ కమిటీలకు నజరానా ఇస్తామన్న: వంటేరు ప్రతాప్ రెడ్డి
మనోహరబాద్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ను మూడవ సారి భారీ మెజారిటీ తో గెలిపించాలని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సూచించారు. శనివారం మనోహరాబాద్ మండల కేంద్రంలోని ప్రవేటు ఫంక్షన్ హల్ లో మండల పార్టీ అధ్యక్షులు పురం మహేష్ అధ్యక్షతన నిర్వహించిన బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో అయన ముఖ్య అతిధిగా హాజరై దిశా నిర్దేశం చేశారు. మనోహరాబాద్ మండలం నుండి నియోజకవర్గం లోనే అత్యధిక మెజారిటీ అందించాలని కోరారు. కార్యకర్తలు కష్టపడి భారీ మెజారిటీ అందించి మొదటి స్థానం లో నిలిపిన బూత్ కమిటీ కి 5 లక్షలు , రెండవ స్థానంలో నిలిపిన బూత్ కమిటీకి 3 లక్షలు , మూడవ బూత్ కమిటీ కి 2 నగదు బహుమతి అందిస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించారు . బూత్ కమిటీ లను ఏర్పాటు చేసుకుని భారీ మెజారిటీ లక్ష్యంగా పని చేయనున్నట్లు అయన తెలిపారు. అదే విదంగా త్వరలో ముఖ్యమంత్రి సభ ఉన్నందున దానిని విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో లో సర్పంచ్ ల ఫోరమ్ కన్వీనర్ మహిపాల్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి,వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి, రైతుబంధు కోఆర్డినేటర్ సుధాకర్ రెడ్డి, నాయకులు శేఖర్ గౌడ్, భాషబోయిన చంద్రశేఖర్, కృష్ణ గౌడ్, పురం రవి, చంద్రశేఖర్, పెంటగౌడ్,పెంటయ్య సర్పంచ్ లు అర్జున్, నాగభూషణం, నర్సయ్య,వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ లు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

0 Comments