Wanted Reporters

Wanted Reporters

*రహదారి హస్త వ్యస్తం ఆగమాగం* -ములుగు జిల్లా సిపిఐ కార్యదర్శి తోట మల్లిఖార్జునరావు

 *రహదారి హస్త వ్యస్తం ఆగమాగం*                   -ములుగు  జిల్లా సిపిఐ కార్యదర్శి  తోట మల్లిఖార్జునరావు.            



వాస్తవ తెలంగాణ ప్రతినిధి, ( నుగూరు)వెంకటాపురం, అక్టోబర్ 14: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వెంకటాపురం భద్రాచలం రాష్ట్రీయ రహదారి   గుంతల మయం గా తయారైందని ములుగు జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు ఆరోపించారు భద్రాచలం తదితర ప్రాంతాలకు వెళ్లి ప్రయాణికులు మండల కేంద్రంలో వాహందారులు మూడు నెలలుగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలియజేశారు వాహనదారులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని వాహనాలను నడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలియజేశారు వాహనదారులు చిన్న పొరపాటు చేసిన వారి ప్రాణాలు గాల్లోకే అని అన్నారు ఇంత జరుగుతున్న మండలంలోని రోడ్లు భవనాల శాఖ అధికారులను పలుమార్లు హెచ్చరించామని అయినా పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు పాత తార్రోడ్డు  తొలగించి చిప్స్ మెటీరియల్ పోసి పూర్తిగా తడపకపోవడంతో మూడు నెలలుగా మండలంలోని పల్లి పంచాయతీలు గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలియజేశారు   మెట్టలు  పోసి  వదిలేసారు  ప్రతిరోజు రోడ్డు దడపాల్సిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో   దుమ్ము  దూళికి  ప్రజలు రోగాల  పాలైనా అధికారులకు ఎవ్వరికి  పట్టదా అని ఆయన ప్రశ్నించారు  నెలనెల  ఉద్యోగులకు   జీతాలు ప్రతినెలా జీతాలు తీసుకునే అధికారులు వారి  వారికుటుంబాలు బాగుంటేచాలా అని  రహదార్లపై ప్రయానికుల  పరి స్థితి  వారికి   ఏమీ పట్టద అని ఆయన ప్రశ్నించారు

  రోడ్డుపై మెట్టలు పోసి వదిలే వదిలేసారని దీనివల్ల వెంకటాపురం పాత్ర పురం వరకు దుమ్ము వల్ల  రోజు   జనాలు హాస్పిల్  పాల అవుతునారఅని  ఆస్మ, ఊపిరి తిత్తులజబ్బు,  జలుబు, దుమ్ము వల్ల  నీరు  కలుషితమై ఎన్నో రకాల రోగాల తో  మందులు కొనలేక అప్పుల  పాలైతే వారిపరిస్థితి ఏమిటీ అని ప్రశ్నించారు ప్రజల గురించి కనీసం ప్రభుత్వ అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ పట్టించుకోవడంలేదని దీనిపై కలెక్టర్ సంబంధిత శాఖ  అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఈ మేరకు సిపిఐ ములుగు జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జున రావు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు

Post a Comment

0 Comments

Ad Code