మంత్రులను కలిసిన మండల ప్రజా ప్రతినిధులు
న్యూస్ ప్రతినిధి నవీన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నీ గజ్వేల్ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలిపించడానికి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు కృషి చేయాలని వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కనుక ఆగిపోయిన ప్రభుత్వ పథకాలు అందరికీ వచ్చేలా కృషి చేస్తానని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటెరూ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు మనోహరాబాద్ మండలం సర్పంచులు ప్రజాప్రతినిధులు కలిసి బుధవారం రోజున ఆయనకు గ్రామంలో నెలకొన్న సమస్యలను వివరించారు బీసీ బందు, దళిత బంధు, గృహలక్ష్మి ,వృద్ధాప్య పెన్షన్లు, రేషన్ కార్డులు, అనేక పథకాలు ప్రవేశపెట్టిన పేదలకు అందలేదని గ్రామంలో అభివృద్ధి పనులు ఎన్నికల కోడ్ తో ఆగిపోయాయని వారు ఆయనతో సమస్యలను చెప్పుకున్నారు వారు చెప్పిన సమస్యలపై ఆయన స్పందిస్తూ పరిష్కరించడానికి కృషి చేస్తానని వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్ నీ భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని కోరారు, వచ్చేది తమ ప్రభుత్వమే కనుక ప్రభుత్వ పథకాల అమలకు ఎలాంటి ఆటంకాలు ఉండయని ఎన్ని నిధులైన వస్తాయని ఆయన ప్రజా ప్రతినిధులతో తెలిపారు , ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పురం మహేష్, మండల వైస్ ఎంపిపి విట్టల్ రెడ్డి , నాయకులు భాషబోయిన చంద్రశేఖర్ , పురం రవి, పంజా బిక్షపతి, శ్రీనివాస్ గౌడ్, వెంకట్ గౌడ్ , రాజు,పూల అర్జున్, సర్పంచ్ లు నాగభూషనo, వేంకటేశ్వర్లు ,నరసయ్య రేణు కుమార్ , తదితరులు పాల్గొన్నారు

0 Comments