శ్రమదానంలో పాల్గొన్న రాష్ట్ర సీనియర్ నాయకులు భాషబోయిన చంద్రశేఖర్ ముదిరాజ్
మనోహరాబాద్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయపల్లి పిటి గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం కోనాయపల్లి గ్రామంలోని డబల్ బెడ్ రూమ్ ( కేసిఆర్ కాలనీ) లో శ్రమదాన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు భాషబోయిన చంద్రశేఖర్ ముదిరాజ్ , సర్పంచ్ ప్రభావతి తో కలిసి వారి ఆధ్వర్యంలో కేసిఆర్ కాలనీ ప్రజలు గ్రామ ప్రజాలు, వార్డు సభ్యుల సహకారంతో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరి భాగస్వామ్యంతో స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛభారత్ గా దేశాన్ని తీర్చిదిద్దడానికి విరుత్మ కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం చాలా సంతోషకరమని, ఇట్టి కార్యక్రమాల అవశ్యకతను ప్రజలందరికీ తెలియజేయడంలో కోనాయపల్లి పంచాయతీ సెక్రెటరీ, పంచాయతీ సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారని, అయితే ప్రజల్లో ఇట్టి కార్యక్రమాల పట్ల మరింత చైతన్యం రావాలని బాధ్యతయుతంగా ఉండి వ్యక్తిగత శ్రద్ధ ఉండి వారి చుట్టు ఉండే పరిసరలను వారి శుభ్రపరచుకునేంతగా మార్పు రావాలని తద్వారా ప్రభుత్వాలు అనుకున్న ఆశయాలను సాధించగలరని అప్పుడే స్వచ్ఛ కోనాయపల్లి , స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛభారత్ సాధనలో మేము సైతం అంటూ ప్రతి ఒక్క పౌరులు ముందుకు రావాలని కోరారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రభావతి నరసింహులు, పంచాయతీ సెక్రెటరీ నవీన్, రాజు ,కెసిఆర్ నగర్ కాలనీ వాసులు , గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


0 Comments