ఘణపూర్ లో స్వచ్ఛత హీ సేవా లొ బాగంగా శ్రమదాన కార్యక్రమాలు : సర్పంచ్ పుష్ప నవీన్ఉప సర్పంచ్ ఆకుల రవి
తూప్రాన్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : తూప్రాన్ మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ ఘనపూర్ గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం సర్పంచ్ మిద్దింటి పుష్ప నవీన్, ఉప సర్పంచ్ ఆకుల రవి ఆధ్వర్యంలో పాలకవర్గం సభ్యులు, గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో గ్రామంలో నీ హై స్కూల్ స్కూల్ నుండి గ్రామంలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరూ భాగస్వామితో స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛభారత్ గా దేశాన్ని తీర్చిదిద్దడానికి వినూత్న కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం చాలా సంతోషకరమని ఇట్టి కార్యక్రమాలపై అవశ్యకతను ప్రజలకు తెలియజేయడంలో ఘనాపూర్ పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్, పంచాయతీ సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తు తమ వంతు పాత్ర పోషిస్తున్నారని అయితే ప్రజల్లో ఇట్టి కార్యక్రమాల పట్ల మరింత చైతన్యం రావాలని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండి వ్యక్తిగత శ్రద్ధ ఉండి చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రపరచుకునేంతగా మార్పు రావాలని తద్వారా ప్రభుత్వాలు అనుకున్న ఆశలను సాధించగలరని అప్పుడే స్వచ్ఛ ఘనపూర్ , స్వచ్ఛ తెలంగాణ స్వచ్ భారత్ సాధనలో మేము సైతం అంటూ ప్రతి ఒక్కరు పౌరులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ మిద్దింటి పుష్ప నవీన్ , ఉప సర్పంచ్ ఆకుల రవి , పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ , పాలకవర్గం సభ్యులు, స్వరూప, దొడ్ల గణేష్, పసుల లావణ్య, గడ్డి జ్యోతి, పసుల రవీందర్, సావిత్రి, ఎండి అన్వర్, లక్ష్మి, స్వామి, గ్రామ ప్రజలు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


0 Comments