కార్యకర్తలకు అండగా నిలిచిన దుబ్బాక సీనియర్ నాయకుడు మామిడి మోహన్ రెడ్డి
వాస్తవ తెలంగాణ రాయపోల్ న్యూస్:-
సిద్ధిపేట జిల్లా రాయాపోల్ మండలం ఎల్కల్ గ్రామంలో కొద్దిరోజుల క్రితం చనిపోయిన పిట్ల శ్రీను మరియు శతగల నగేష్ అయినటువంటి బి ఆర్ ఎస్ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి వారికి ఆపదలో అండగా నిలుస్తానని దౌర్యం చెప్పిన దుబ్బాక బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు మా మి డి మో హ న్ రె డ్డి తెలిపారు. కార్యకర్త ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. వారు మాట్లాడుతూ కే సి ఆర్ అడుగు జాడల్లో ముందుకు సాగుతూ ఆ భగవంతుడు నాకిచ్చిన శక్తి సామర్ధ్యాల మేరకు ఎల్లవేళలా నా ఓపిక ఉన్నంత వరకు కాదు నా ప్రాణం ఉన్నంత వరకు నా కార్యకర్తలను కాపాడుకుంట అని బరోసా కల్పించాడు. పదవులు లేకున్నా సగటు వ్యక్తిగా ఆపదలో అండగా నిలుస్తాన్నాడు. ఈ కార్యక్రమంలో దుబ్బాక సీనియర్ బి ఆర్ ఏస్ నాయకుడు మామిడి మోహన్ రెడ్డి మరియు గ్రామ సర్పంచ్ కుమార్, ఎం పి టి సి వెంకటేష్, ఆత్మ కమిటీ డైరెక్టర్ మురళి, తోర్రి మల్లేష్, బి అర్ ఏస్ నాయకులు పాల్గొన్నారు.

0 Comments