Wanted Reporters

Wanted Reporters

చంటి పిల్లలతో 3 రోజులుగా ఆధార్ కొరకు క్యు లో ప్రజలకు తప్పని తిప్పలు

 చంటి పిల్లలతో 3 రోజులుగా ఆధార్  కొరకు క్యు లో ప్రజలకు తప్పని తిప్పలు





తూప్రాన్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : ప్రజల విశిష్ట గుర్తింపు కార్డు ఆధార్ సేవల కోసం ప్రజలకు అవస్థలు తప్పడం లేదు.. తూప్రాన్ లొని ఆధార్ కేంద్రంలో వివిధ గ్రామాలనుండి ప్రజలు ఆధార్ నవీకరణ, పిల్లలకు నూతన ఆధార్ కోసం వచ్చే వారి సంఖ్యకి అనుగుణంగా ఆధార్ కేంద్రం లో ఏర్పాట్లు లేకపోవడం లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూప్రాన్ ఆధార్ కేంద్రంలో రోజు పరిమితి సంఖ్యలో టోకెన్ లు కేటాయించి వారికి మాత్రమే సేవలు అందిస్తున్నారు. ప్రజల నుండి అధిక మొత్తంలో 250 రూపాయలను వసూలు చేస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు, ఇలాంటి పరిస్థితి లో తమకు ఎక్కడ టోకెన్ సంఖ్య దొరకదేమో అని ప్రజలు ఉదయం ఐదు గంటలనుండి క్యూ లైన్ లో నిలబడుతున్నారు. చిన్నపిల్లను తీసుకుని అంత ఉదయం ఆధార్ సేవలకోసం రావడం వల్ల పిల్లలకు అనారోగ్యంకు గురవాతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ సేవలకు వచ్చే ప్రజలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి అందరికి సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Post a Comment

0 Comments

Ad Code