Wanted Reporters

Wanted Reporters

గజ్వేల్ లో కేసిఆర్ గెలుపు ఎవరు ఆపలేరు జడ్పీ చైర్ పర్సన్- హేమలత గౌడ్

 గజ్వేల్ లో కేసిఆర్ గెలుపు ఎవరు ఆపలేరు జడ్పీ చైర్ పర్సన్- హేమలత గౌడ్





మనోహరబాద్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ను గజ్వెల్ నియోజకవర్గం నుండి మూడవ సారి భారీ మెజారిటీ తో గెలిపించాలని జడ్పీ చైర్ పర్సన్ హేమలత గౌడ్ ప్రజలకు సూచించారు. శుక్రవారం మనోహరాబాద్ మండలం లొని దండుపల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు పురం మహేష్ ఆధ్వర్యంలో రెండవ రోజు  ప్రచారంలో భాగంగా రాష్ట్ర సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, పాక్స్ చైర్మన్ మెట్టూ బాలకృష్ణ రెడ్డి, వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి లతో కలిసి నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో కెసిఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించి బిఆర్ఎస్ కు ఓటు వేయాలని ప్రజలను అర్జీంచారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన కెసిఆర్ అని అలాంటి వ్యక్తి ని మూడవ సారి ఆకండ మెజారిటీ తో గెలిపించుకోవాలని సూచించారు. అనంతరం సంక్షేమ పథకాల అమలును అడ్డుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ చిత్ర పటానికి వినతి పత్రం అందచేశారు. సంక్షేమం ను అడ్డుకుంటే ప్రజల అగ్రహానికి గురికాక తప్పదని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో రైతు సమితి అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, భాష బోయిన చంద్రశేఖర్ ముదిరాజ్ ,జావీద్ పాషా, పంజా బిక్షపతి, మన్నే దర్మేందర్, మహేందర్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి రాహుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code