మేడిపల్లి సీఐ గా బాధ్యతలు చేపట్టిన పి.సైదులు కలిసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు...
సిఐ ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన - చెంగిచెర్ల మాజీ ఉపసర్పంచ్ కొత్త రవి గౌడ్.
మేడ్చల్ జిల్లా,(వాస్తవతెలంగాణ మేడిపల్లి/సెప్టెంబర్ : 13) రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ గా బాధ్యతలు చేపట్టిన సీఐ పి.సైదులు ని మరియు ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి లను బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చెంగిచెర్ల గ్రామ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ కొత్త రవి గౌడ్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్,మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్పొరేషన్ కు సంబంధించి శాంతి భద్రతల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్సం సోమన్న గౌడ్, కుమార్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments