*ఉద్యోగ భద్రత కల్పించాలని మున్సిపల్ కార్మికుల నిరసన*
మేడ్చల్ వాస్తవ తెలంగాణ.
తమకు వేతనాలు పెంచి ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని,సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం గుండ్లపోచంపల్లి మున్సిపల్ కార్మికుల నిరసన కార్యక్రమం చేపట్టారు. బిల్ కలెక్టర్లు,మెప్మా, కంప్యూటర్ ఆపరేటర్లు, పారిశుధ్య కార్మికులు మున్సిపల్ కార్యాలయం
ముందు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు.అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ మద్దుల
లక్ష్మిశ్రీనివాస్ రెడ్డి, కమీషనర్ రాములు కు వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో బిల్ కలెక్టర్లు ప్రసాద్,శేషిధర్ రెడ్డి,సంతోష్,కిరణ్, సుజాత,శ్యామసుందర్,సిబ్బంది ప్రభాకర్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments