Wanted Reporters

Wanted Reporters

ఘనపూర్ గ్రామంలో యువతకు క్రీకెట్ కిట్ అందజేత

 ఘనపూర్ గ్రామంలో యువతకు క్రీకెట్ కిట్ అందజేత*

యువత క్రీడల వైపు ఆసక్తి చూపాలి*

- ఎంపిటిసి మాలోత్ అంకిత రవి నాయక్



మేడ్చల్ వాస్తవ తెలంగాణ మేడ్చల్ న్యూస్, ప్రతినిధి ఆనంద్:


మేడ్చల్ మండలం రాజబొల్లారం గ్రామ పంచాయతీ లోని ఘనపూర్ గ్రామంలో లో ఎంపిటిసి మాలోత్ అంకిత రవి నాయక్  ఆధ్వర్యంలో  కో ఆప్షన్ నెంబర్ మాలోత్ రవి నాయక్ చేతుల మీదుగా యువకులకు క్రికెట్ కిట్టు అందజేశారు. ఈ సందర్భంగా మాలోత్ రవి నాయక్ మాట్లాడుతూ గతంలో ఎంపీటీసీ ఎన్నికల్లో యూత్ అందరికీ క్రికెట్ కిట్టు ఇప్పిస్తానని మాట ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారం క్రికెట్ కిట్టు ఇప్పించడం జరిగిందన్నారు. యువత క్రికెట్ లో బాగా రాణించాలని సూచించారు. యూత్ సభ్యులు మాట్లాడుతూ అన్నమాట ప్రకారం తమకు క్రికెట్ కిట్టు ఇప్పించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు ఎం రఘురాం రెడ్డి, యాదగిరి, నాయకులు కూరాకుల శీను, నాగని వెంకటేష్, గ్రామ యువకులు సాయి కిరణ్, కే కిరణ్, టీ నిఖిల్, కే వెంకటేష్, కే భాస్కర్, టి సాయిరాం, దినేష్, ఎన్ వినయ్, ఎన్ నవీన్, కిరణ్, భాష, సాయి, ఎన్ రవి, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments

Ad Code