*మహా జనసంపర్క్ అభియాన్ కార్యక్రమం*
నరేంద్ర మోదీ 9 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా ఇంటింటికి బిజెపి
వాస్తవ తెలంగాణ న్యూస్// వరంగల్ జిల్లా// సంగెం ప్రతినిధి:
సంగెం మండలం నల్లబెల్లి గ్రామంలో పర్యటించిన పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్,గుజ్జ సత్యనారాయణ రావు కాచం గురు ప్రసాద్ కొత్తగూడెం నియోజకవర్గ ప్రబారి, పరకాల కౌన్సిలర్ దేవునూరి మేఘనాథ్ పరకాల కౌన్సిలర్ కొలనుపాక భద్రయ్య హాజరయ్యారు.గ్రామంలో ఇంటింటికి తిరిగి నరేంద్ర మోడీ 9 సంవత్సరాల సుపరిపాలన గురించి గ్రామంలో ఉన్న ప్రజలకు తెలియపరిచారు మోడీ సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపించేశారు విజయచందర్ రెడ్డి మాట్లాడుతూ....దేశాయితం కోసం మోడీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కారం మవుతాయన్నారు. మోదీ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.ప్రధానిప్రజలకు చేసిన సేవలను వివరించి మరోసారి దీవించాలని ప్రజల్లోకి వెళ్లేందుకు బిజెపి మహాజన్ సంపర్క్ అభియాన్ పేరిట రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాలు వారీగా ప్రజలందరికీ అవగాహన కలుగాలని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బుట్టి కుమారస్వామి, జిల్లా కార్యదర్శి మొలుగూరి శ్రీనివాస్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బెజ్జంకి శేషాద్రి, మాజీ మండల అధ్యక్షులు వడ్డీ దేవేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు కీసర వీరయ్య, భూక్య వెంకన్న, శక్తి కేంద్ర ఇన్చార్యులు, బోనాల కొమరయ్య,బెజ్జంకి కొమ్మాలు, యువర్ మోర్చా జిల్లా నాయకులు చంద్రమౌళి, బూత్ అధ్యక్షులు, బిజెపి నాయకులు కార్యకర్తలు, గ్రామ ప్రజలు, వృద్ధులు, మహిళలు పాల్గొన్నారు.


0 Comments