Wanted Reporters

Wanted Reporters

ఫ్లెక్సీలు చింపే నీచమైన రాజకీయాలు..మానుకోండి

 *కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాల ఫ్లెక్సీని చించివేసిన గుర్తు తెలియని వ్యక్తులు*

నీచమైన రాజకీయాలు చేసి ఇలాంటి చిల్లర పనులు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం ఊరుకోబోమని  హెచ్చరించారు




వాస్తవ తెలంగాణ న్యూస్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి  పవన్

మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరిధిలోని సాలోజిపల్లి గ్రామంలో సోనియా గాంధీ ప్రకటించినటువంటి ఆరు పథకాల ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి చించి వేశారు కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రెసిడెంట్ వేముల చంద్రయ్య మాట్లాడుతూ ఇలాంటి నీచమైన రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు రాబోయేది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ఆరు పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆరు పథకాల ప్లెక్సీలు గ్రామ గ్రామాన వేస్తుంటే ఓరువలేక ప్లెక్సీలు చించి వేయడం సబబు కాదని హెచ్చరించారు అలాగె టేక్మాల్ మండల పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి ఆరు పథకాల ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారని వారిని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది అని తెలిపారు ఇప్పటికైనా ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరుకునేది లేదని అన్నారు ఈ కార్యక్రమంలో సాలోజిపల్లి గ్రామ అధ్యక్షులు వేముల చంద్రయ్య ఉపాధ్యక్షులు వేముల యాదగిరి మాల సుధాకర్ సొంగ రాజు మహమ్మద్ రియాజుద్దీన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments

Ad Code