ఎలక్షన్ల ముందే కొత్త బిచ్చగాళ్ళలా ప్రతిపక్షాలు ఓట్ల కోసం వస్తాయి : వంటేరు ప్రతాప్ రెడ్డి
తూప్రాన్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : తూప్రాన్ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత తూప్రాన్ అభివృద్ధికి 180కోట్ల నిర్మాణం పనులు చేసినట్లు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు తూప్రాన్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో వారు చెప్పుకోవడానికి తూప్రాన్ లో ఏమి అభివృద్ధి చేశారని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని రైతుబంధు రైతు బీమా రాదని యూరియా డిఏపి అందుబాటులో ఉండదని ధరణిని తీసిస్తారని స్కీములు స్కాములు పెడుతూ పేద ప్రజలను దోచుకుంటారని విమర్శించారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నిరంతరంగా కొనసాగాలంటే సంక్షేమ పథకాలు అందరికీ అందాలంటే కెసిఆర్ ను మరోసారి గెలిపించాలని కోరారు గజ్వేల్ నియోజకవర్గంలో లక్షన్నర మెజార్టీతో ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు బుధవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తూప్రాన్ లో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేయడానికి వస్తున్నారని సభను విజయవంతం చేయాలని కోరారు విలేకరుల సమావేశంలో మునిసిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్ ,వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు కొడిప్యాక నారాయణగుప్త , మామిడి వెంకటేష్ , కృష్ణ రవీందర్ రెడ్డి సత్యలింగం ప్రతాప్ రెడ్డి, కృష్ణారెడ్డి రఘుపతి, పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సతీష్ చారి తదితరులు పాల్గొన్నారు

0 Comments