పెడల్ ప్రైడ మెగా సైకిలింగ్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్
కూకట్ పల్లి (వాస్తవ తెలింగాణా ) కూకట్ పల్లి సర్కిల్ /
ఆల్విన్ కాలనీ తులసి వనం ప్రాంగణంలో మహిళ దినోత్సవం సందర్భంగా అవని స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తుర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పెడల్ ప్రైడ్ మెగా సైక్లింగ్ ను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మహిళ దినోత్సవం సందర్భంగా అవని స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తుర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పెడల్ ప్రైడ్ మెగా సైక్లింగ్ ఈవెంట్ ను నిర్వహించడంపై అభినందించారు శిరీష సత్తుర్ ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అని సమాజ హితం ఎన్నో మంచి సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు అని , నేటి ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక శ్రమ ఎంతో అవసరం అని గుర్తు చేయడం ఈ సైక్లింగ్ ఈవెంట్ ఎంతగానో తోడ్పడుతుంది అని ఎంతో మందికి స్ఫూర్తి గా నిలుస్తుంది అని , వృద్ధులు ,యువత , చిన్న పిల్లలు పాల్గొనడం ఎంతో ఆనందయాకం , ప్రతి ఒక్కరు ఆరోగ్యము పట్ల ఎంతో శ్రద్ధ వహించాలని, శారీరక శ్రమ వలన మానసిక ఉల్లాసం ,ప్రశాంతత చేకూరుతుంది అని, మారిన జీవన శైలి లో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాయమం చేయాలని, ఈ సైక్లింగ్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది ,ఇది ఒక మంచి శుభపరిణామం అని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు ఈ కార్యక్రమంలో డా ఆర్ . నవీన్ సత్తుర్, ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు సమ్మారెడ్డి,మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు కాశినాథ్ యాదవ్, పోశెట్టిగౌడ్, రాములుగౌడ్, షౌకత్ అలీ మున్నా, సత్యనారాయణ, మరియు అవని స్వచ్చంద సభ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments