బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో పని చేయాలి ఎమ్మెల్యే కృష్ణారావు
కూకట్ పల్లి మార్చ్ 05 ( వాస్తవ తెలంగాణ)
కూకట్ పల్లి నియోజకవర్గం కె పి హెచ్ బి ఆల్లాపూర్ డివిజన్ లో బూత్ స్థాయి కమిటీ సమావేశం లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ లు మందడి శ్రీనివాసరావు సభియ గౌసుద్దిన్ పాల్గొన్నారు ఈ సంద్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వంలో కూకట్ పల్లి నియోజక వర్గంలో అభివృద్ధి తో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకి అందించడం లో ముందు ఉందని అల్లా పూర్ డివిజన్ మంచి నీళ్ళు రోడ్లు విద్యుత్ సదుపాయాలు లేక ప్రజలు అల్లాడి పోయేవారని కానీ నేడు ఆ పరిస్తితి లేదు అని ఇపుడు అల్లా పూర్ అభివృద్ధి కి మారు పేరుగా ఉంది అని అన్నారు కేపీ హెచ్ బి డివిజన్ లో ప్రజలకు అందించే మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా వేల కోట్ల రూపాయలతో ఫ్లై ఓవర్లు అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం ప్రత్యేక మహిళా పార్కులు ఓపెన్ జిమ్ లు దేవాలయాలు ఇండోర్ స్టేడియం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలియజేశారు అభివృద్ధి ప్రజల్లోకి తీసుకు వెళ్ళే బాధ్యత కార్యకర్తలపై ఉంది అని బూత్ స్థాయి లో ప్రతి కార్యకర్త చిత్త శుద్ధతో పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో కూకట్పల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ కోఆర్డినేటర్ సతీష్ అరోరా డివిజన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఐలయ్య అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

0 Comments