* ఉచిత వైద్య శిబిరం*
జగదేవపూర్ వాస్తవతెలంగాణ:-ఆదిత్య హాస్పటల్ ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని ఆలోచన చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో, ప్రతి మండలలో ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఆదిత్య హాస్పటల్ ఉచిత మెగా వైద్య శిబిరం ఆధ్వర్యంలో జగదేవపూర్ మండల కేంద్రంలో బుధవారం రోజున మార్కేట్ (యార్డ్) లో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్
సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి హాజరై వైద్య శిబిర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆదిత్య హాస్పటల్ వైద్య బృందం డాక్టర్స్ శిధర్, భాస్కర్, ప్రవీణ్ లు కలిసి ప్రతాప్ రెడ్డి ని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిత్య హాస్పటల్ నుండి మెగా వైద్య ఉచిత శిబిరం ద్వారా వివిధ గ్రామ ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి దానికి తగిన మెడిసిన్స్ జరుగుతుంది ప్రజాలందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అన్నారు వృద్ధులు, మధ్య వయసుకులు ప్రతిఒక్కరు పరీక్షలు చేసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలి అన్నారు. పేద ప్రజల కోసమే మన ముందుకు నిలబడుతున్న వైద్య బృందం సేవలు ఎనలేనివి సేవ చేయాలనే దృక్పథంతో మేము సైతం అనారోగ్యంతో ఉన్న ప్రజలందరి కోసమే ఆదిత్య హాస్పటల్ నుండి ఉచిత సేవలు అందిస్తామని చెప్పారు.
గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా పరీక్షలు చేసుకొని మెడిసిన్స్ వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య వైద్య బృందం, ఎం పిపి బాలేశం గౌడ్,గ్రామ అధ్యక్షుడు బుద్ధ నాగరాజు, మహిళ అధ్యక్షురాలు ఎంపీటీసీ కవిత,జిల్లా ఫోరమ్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్ , సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రాచర్ల నరేష్, గ్రామ పంచాయితీ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
0 Comments