Wanted Reporters

Wanted Reporters

మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ బిజెపి నాయకులు

 మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ బిజెపి నాయకులు



మేడ్చల్ వాస్తవ తెలంగాణ.


సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ బిజెపి పార్టీల నుండే కాకుండా యువకులు కూడా బిఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన సుమారు 20 మంది కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో ఆదివారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారధ్యంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందిందని, మూడోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. మేము చేసిన అభివృద్ధికి ఫలితంగా రాబోయే ఎన్నికల్లో పోటు అడిగాకు బిఆర్ఎస్ పార్టీకి ఉందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని చూసి ఓటేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బిజెపి నాయకులకు ఓటు అడిగి హక్కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల వైస్ ఎంపీపీ వెంకటేశం, మేడ్చల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాజమల్లారెడ్డి, మామిండ్ల వెంకటేశం, ఆనంద్, సత్యనారాయణ, బందెల చంద్రయ్య, బాబు, లడ్డు, నరసింహ, యాదగిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code