Wanted Reporters

Wanted Reporters

గంజాయి రహితంగా మార్చేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలి, మంచిర్యాల ఏసీపీ. సాధన.రష్మీ పేరమాళ్. (ఐపిఎస్)

గంజాయి రహితంగా మార్చేందుకు  ప్రజలు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలి, మంచిర్యాల ఏసీపీ. సాధన.రష్మీ పేరమాళ్. (ఐపిఎస్)




వాస్తవ తెలంగాణ న్యూస్,02,ఫిబ్రవరి  మంచిర్యాల జిల్లా

రామగుండం పోలీస్ కమిషనర్. ఎస్.చెంద్రశేఖర్ రెడ్డి.ఐపిఎస్ (డిఐజి) ఉత్తర్వుల మేరకు 

నిషేధిత డ్రగ్స్, గంజాయి పై  అవగాహన సదస్సు 


యువత ను వినాశనం వైపు తీసుకెళుతున్న డ్రగ్స్, గంజాయి కల్చర్ ను నిర్ములించడం మన అందరి బాధ్యత అని అందుకు గ్రామాలలో ప్రజలు,ప్రజాప్రతినిధులు తమ గ్రామాలను  డ్రగ్స్, గంజాయి రహిత గ్రామాలుగా మార్చేందుకు దృఢ నిశ్చయంతో  ఉండాలని ఆయా గ్రామాల సర్పంచ్ లకు, ఎంపీటీసీ లకు, ఇతర ప్రజా ప్రతినిధులకు మంచిర్యాల ఏసీపీ సాధన.రష్మీ పేరమాళ్ ఐపిఎస్  పిలుపునిచ్చారు.


  హాజీపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో హాజిపూర్ మండలములోని 13 గ్రామ పంచాయతీల  గ్రామ సర్పంచ్,ఉప సర్పంచులు,ఎంపీటీసీలు,విలేజ్ సెక్రటరీలు, విఆర్ఓలు,అంగన్వాడీ సిబ్బంది కి  నిషేధిత డ్రగ్స్, గంజాయి పై నిర్వహించిన అవగాహన  సమావేశానికి మంచిర్యాల ఏసీపీ సాధన.రష్మీ  పేరమాళ్.ఐపిఎస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.


ఈ సందర్భంగా ఏసీపీ  మాట్లాడుతూ మండల కేంద్రంతో పాటు13 గ్రామపంచాయతీల గ్రామాలలో  డ్రగ్స్,గంజాయి ఉత్పత్తి, సరఫరా, మరియు వినియోగించే వారి పై ప్రత్యేక నిఘా ఉంచి గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డ్రగ్స్ , గంజాయి ని ఉత్పత్తి, సరఫరా చేసే వారి వెనుక  ఎంతటి వారు ఉన్న, ఏ పార్టీ వారు ఉన్న  వదిలే ప్రశక్తి లేదని అట్టి వారి పై పిడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తాము అని ఏసీపీ గారు అన్నారు.


హాజీపూర్ మండలం ను డ్రగ్స్ గంజాయి రహిత మండలం గా మార్చేందుకు మండలం లోని  గ్రామ సర్పంచ్ లు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబెర్స్, విలేజ్ సెక్రటరీ లు,విఆర్ ఓలు,అంగన్వాడీ సిబ్బంది, ప్రజలు బాధ్యతాయుతంగా కంకణ బద్ధులై ఉండాలని అన్నారు.


 గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు వ్యసనాలకు పాల్పడి మెంటల్ గా, ఫిజికల్ గా ఫిట్నెస్ ను కోల్పోవడం,  అనారోగ్యం బారినపడటమే కాకుండా తాము ఏమి చేస్తున్నామో అనే సెన్స్ ను కోల్పోయి, ఆర్థిక పరితిస్థితులు దిగ జారీ నేరాలకు పాల్పడటం జరుగుతుందని యువత పై అంతగా ప్రభావం చూపే డ్రగ్స్ ,గంజాయి పదార్థాల ఉత్పత్తి, సరఫరా ను తమ ప్రాంతంలో గుర్తించి పోలీస్ వారికి సమాచారం అందించుటకు  గ్రామ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు వార్డు మెంబర్లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.


 డ్రగ్స్ ,గంజాయి ఉత్పత్తి, సరఫరా, వినియోగం కు సంబందించిన  ఏమాత్రం అనుమానం వచ్చిన సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని అన్నారు.


గ్రామ స్థాయిలో   ప్రత్యేక ఇన్ఫర్మేషన్ కు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.

 

గ్రామాలలో, పట్టణాలలో ఇండ్ల దగ్గర గాని, బయట పొలాలలో, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన  అసైన్డ్ భూములలో గంజాయి మొక్కలు దొరికిన ఆ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసేందుకు అవకాశం ఉంటుందని అలాగే పట్టా భూములలో గంజాయి దొరికిన ఆ భూమి యజమానికి రైతు బంధు రాకుండా కలెక్టర్ ద్వారా రద్దు చేయడం జరుగుతుందని, గంజాయి మొక్కలు 4 దొరికిన సంబంధికుల పై క్రిమినల్ కేసులు నమోదు చేసి  

పిడి,యాక్ట్ కేసునమోదు చేస్తామని  తెలిపారు.

డ్రగ్స్  గంజాయి ను  సమూలంగా  అరికట్టడం లో ప్రజా ప్రతినిధుల తో పాటు గ్రామ ప్రజల పై కూడా బాధ్యత ఉందని, ఎక్కడైనా వాటి సరఫరా, ఉత్పత్తులు  జరిగిన, ఎవరైనా వినియోగిస్తున్న వెంటనే ప్రజలు బాధ్యతగా భావించి సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.


తల్లితండ్రులు తమ పిల్లలు డ్రగ్స్, గంజాయి కు ఎడిక్ట్ అయినట్లు గుర్తించిన సీక్రెట్ గా పోలీస్ వారికి సమాచారం అందిస్తే వారిని కౌన్సిలింగ్ కు పంపడం జరుగుతుందని అన్నారు. 


 ఆ గ్రామనికి ప్రభుత్వం నుండి వచ్చే అన్ని రకాల బెనిఫిట్స్ రద్దుకు ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని ఈ విషయాన్ని  గ్రామాల ప్రజలకు తెలియజేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రజలు ఎవరు కూడా ఆశకు పోయి ఇబ్బందులు పడవద్దు అని ఏసీపీ గారు విజ్ఞప్తి చేశారు.


అనంతరం అందరితో కలిసి ప్రతిజ్ఞ ఈవిధముగా 


 మాయొక్క వీధిలో గాని, గ్రామములో గాని ఎవరైనా వ్యక్తులు అట్టి నిషేదిత  మత్తు పదార్థాలు సేవించినా, అమ్మినా, కొన్నా, రవాణా చేసినా లేదా గంజాయి మొక్కలు ఎవరయినా సాగు చేసినా వెంటనే నేను అట్టి సమాచారంను  సంబందిత పోలీస్ అధికారులకి సమాచారం అధిస్తాం అని మాయొక్క గ్రామమును పూర్తిగా గంజాయి/డ్రగ్స్ రహిత గ్రామముగా తీర్చిదిద్దుతాము అని ప్రతిజ్ఞ  చేయించడం జరిగింది.


ఈ కార్యక్రమంలో మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్, హాజీపూర్ ఎంపీడీఓ హైమద్, ఎంఆర్ఓ.వాసంతి, ఎస్ఐ ఉదయ్ కిరణ్, హాజీపూర్ పి హెచ్ సి,డాక్టర్ క్రాంతి కుమార్,ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఉప సర్పంచులు,ఎంపీటీసీ లు, వార్డు మెంబర్లు పోలీస్ సిబ్బంది మరియు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code