విజయవంతంగా ఇద్దరికి శస్త్రచికిత్స
ఆర్సీపురం,వాస్తవ తెలంగాణ:
సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్ పరిధిలోని పనేషియా ఆసుపత్రిలో మంగళవారం ఇద్దరికీ శస్త్రచికిత్స విజయవంతమైంది. రమేష్ (37) మోచేతికి దెబ్బతగిలి ముఖ్యమైన రక్తనాళాలు తెగిపోయాయి. పరీక్షలు చేసి శస్త్రచికిత్సతో కాలి నుంచి రక్తనాళం తీసుకొని తగిన చేతి రక్తనాళానికి ఉపయోగించారు. మరో ఘటనలో గురురాజ్ (26)రోడ్డు ప్రమాదంలో కుడికాలు కు సంబంధించి రెండు ఎముకలు విరిగాయి. అవసరమైన పరీక్షలు చేయడంతో కాలికి వచ్చే రక్తనాళాలు తెగి ఉన్నట్లు వైద్యులు గమనించి శస్త్రచికిత్స చేశారు. ఎడమ కాలు నుంచి రక్తనాళం తీసుకొని తెగిన రక్తా నాలనికి కలపడంతో వెంటనే రక్తసరఫరా యధాస్థితికి వచ్చింది. విరిగిన ఎముకలకు రాడ్ వేసి అతికించారు. ఈ రెండు సర్జరీలను డాక్టర్లు అర్జున్ రెడ్డి, దిలీప్, శైలకర్ రెడ్డి విజయవంతంగా చేసినట్లు ఆసుపత్రి వర్గాలు విలేకరులకు తెలిపారు. ఇందులో ఆపరేషన్ సిబ్బంది వెంకటేష్, శ్రీనివాస్, రాంబాబు, స్రవంతి తదితరులు ఉన్నారు.
0 Comments