Wanted Reporters

Wanted Reporters

కోటి యాభై ఐదు లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన

 కోటి యాభై ఐదు లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన





ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తాందని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గుమ్మడిదల మండలం పరిధిలోని పన్నెండు గ్రామాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కోటి యాభై ఐదు లక్షల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్ల పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని పేర్కొన్నారు. కరోనా మూలంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికిని సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం ఎక్కడ వెనుకంజ వెయ్యలేదని అన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకం | తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎంపిక చేసిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల విలువైన యూనిట్లు అందించడంతో పాటు వారి ఆర్థిక అభివృద్ధికి వెన్నంటి ఉంటూ కృషి చేస్తున్నామని తెలిపారు.

Post a Comment

0 Comments

Ad Code