హైదరాబాద్,వాస్తవ తెలంగాణ:
దేశ సమగ్రాభివృద్ధి, ప్రజల వికాసం కోసమే సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని పునర్ రచించుకోవాలని పిలుపునిచ్చారని తెరాస స్పష్టంచేసింది. సీఎం చేసిన ప్రకటలో తప్పేముందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, క్రాంతి కిరణ్ ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, భాజపాలు తమ స్వార్థం కోసం సవరణల పేరుతో రాజ్యాంగానికి తూట్లు పొడిచాయని విమర్శించారు. దీన్ని సరిచేసి అన్నివర్గాల ప్రజలకు సమ్మిళిత అభివృద్ధి అందించేందుకు కేసీఆర్ కొత్త రాజ్యాంగం అవసరమనే ప్రతిపాదన చేశారన్నారు. ఈ అంశంపై సహేతుక చర్చ జరగకుండా కాంగ్రెస్, భాజపా సహా కొన్ని పార్టీలు తెరాసపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.
0 Comments