ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేసిన బొంతపల్లి అంబేద్కర్ వారసులు
(వాస్తవ తెలంగాణ న్యూస్) గత రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజ్యాంగంపై చేసిన అవహేళన మాటలకు నిరసనగా ఈరోజు సంగారెడ్డి జిల్లా. గుమ్మడిదల మండలం బొంతపల్లి లో అంబేద్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కి శవ యాత్ర ఊరేగింపుగా డప్పు చప్పుళ్ళతో అంబేద్కర్ విగ్రహం నుండి బొంతపల్లి కమాన్ వద్దకు ఊరేగింపుగా వెళ్లి అక్కడ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కె సుదర్శన్, ఎన్ విష్ణు వర్ధన్, ఎమ్ రమేష్, యాదగిరి, మాట్లాడుతూ. ప్రపంచంలోనే అతి గొప్ప లిఖిత రాజ్యాంగం గా గుర్తింపబడిన భారత రాజ్యాంగాన్ని ఇలా మారుస్తానని అనడం నీ వల్ల కాదు కదా మీ తాత వల్ల కాదని వాఖ్యానించారు ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లేని పక్షాన కేవలం రాష్ట్రంలోనే కాదు భారతదేశ స్థాయి లో నిరసనలు కొనసాగుతాయని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలి శంకర్, బి నాగేష్, ఆర్ శివ, కె పురుషోత్తం ,ఆర్ బాలు, ఎం రాజు, కె మహంకాళి, కె గోపాల్, ఏం శ్రావణ్, కె రవి, కె రమేష్, వై యేసు, వై ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.
0 Comments