పుల్లూరు బండ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న :- రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు*
సిద్దిపేట వాస్తవతెలంగాణ న్యూస్:-సిద్దిపేట గ్రామీణ మండలంలోని పుల్లూరు బండ జాతర చివరి రోజు భక్తజన సంద్రాన్ని తలపించింది. ఉత్సవాల్లో భాగంగా గురువారం గోపాల కాల్వలు సేవ, సుదర్శన నారసింహ హోమం, విష్ణుసహస్రనామ పారాయణం, స్వామివారి కళ్యాణోత్స కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి బండపై ఊరేగించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ పరిసరాలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింభించేవి ఈ జాతరలని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ జాతరలో పాల్గొంటారనీ, 600ఎకరాలలో ఏకశిలాపై కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంకు 800 ఎండ్ల చరిత్ర ఉందన్నారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంతో పాటు తెలంగాణలోని ఆలయాల అభివృద్ధిపై ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు వివక్షత చూపారన్నారు. స్వరాష్ట్రం సిద్ధించిన వెంటనే పుల్లూరు బండ శ్రీ స్వయంభూ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని దశల వారీగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు కోట్ల యాభై లక్షలతో ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామన్నారు. భక్తుల సౌకర్యార్థం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. కొండపై వివాహాలు చేసుకునేందుకు వీలుగా ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టి ఇవాళ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు చిలకమర్రి ఫణి కుమారా చార్యులు , కలకుంట్ల కృష్ణ మాచార్యులు, కలకుంట్ల రంగాచారి, పొడిశెట్టి రామకృష్ణ మాచార్యులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
0 Comments