అప్పుడే పుట్టిన ఆడ శిశువు పట్ల అమానుషం
గుమ్మడిదల తెలంగాణ సాక్షి న్యూస్:-
అభం శుభం తెలియని అప్పుడే పుట్టిన ఆడ శిశువునీ గంటల వ్యవధిలోనే గుర్తుతెలియని వ్యక్తులు విడిచివెళ్లిన దారుణమైన సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో గల ఓ కాలనీలో అప్పుడే పుట్టిన నవజాత ఆడశిశువును నిర్మానుష్య ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు విడిచి వెళ్లారు. స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న గ్రామ ఎంపిటిసి గోవర్ధన్ గౌడ్ వెంటనే స్పందించి ఘటనా వెళ్లి పోలీసులకు, మైత్రి ఫౌండేషన్ అంబులెన్స్ ప్రతినిధులకు సమాచారం అందించారు. పోలీసుల సాయంత్రం ఫౌండేషన్ సభ్యులు అంబులెన్స్ ద్వారా పసికందులు సంగారెడ్డి ప్రభుత్వ తరలించారు. వైద్య సహాయం అనంతరం పసికందులు శిశు సంక్షేమ శాఖ ప్రతినిధులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఆడ శిశువు పుట్టిన వెంటనే ఈ చర్యకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ దారుణమైన సంఘటనకు ఒడిగట్టిన వ్యక్తులపై కఠినంగా చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


0 Comments