ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల కరపత్రాలు విడుదల
పటాన్ చెరు,వాస్తవ తెలంగాణ న్యూస్:సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం బండ్లగూడ గ్రామంలో నందన్ రతన్ ఫ్రైడ్ కాలనీలో నీ సొంత స్థలంలో శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని పటాన్ చెరు మాజీ సర్పంచ్, ఎం డి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు నిర్మించారు. ఆలయంలో దేవత విగ్రహాల ప్రతిష్టాపన ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని గురువారం ఆవిష్కరించారు. ఈ నెల 10వ తేదీన గురువారం సాయంత్రం ఐదు గంటలకు మాదిరి తులసి లక్ష్మి దేవేందర్ రాజు దంపతుల చేతుల మీదుగా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 9 తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజ, పదో తేదీ ఉదయం 8 గంటలకు దేవతా హోమాలు, 11వ తేదీ ఉదయం 8 గంటలకు దేవతా ప్రతిష్ట కళ్యాణం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవేందర్ రాజు పేర్కొన్నారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు రమణారెడ్డి, కాలనీ సభ్యులు, యువకులు పాల్గొన్నారుv
0 Comments