భీమ్ దీక్ష లో పాల్గొన్న బిజెపి నాయకులు
జిన్నారం,వాస్తవ తెలంగాణ న్యూస్: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బీజేపీ నాయకులు గురువారం భీమ్ దీక్షలో పాల్గొన్నారు. భారత రాజ్యాంగం, ప్రధాని మోడీ పై విమర్శలు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ భీమ్ దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లో బిజెపి జిల్లా సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, స్థానిక నాయకులు లక్ష్మణస్వామి, మేఘనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
0 Comments