Wanted Reporters

Wanted Reporters

మాఘ అమావాస్య కు ఏడుపాయల ముస్తాబు

 మాఘ అమావాస్య కు ఏడుపాయల ముస్తాబు  




   వాస్తవ తెలంగాణ/పాపన్నపేట జనవరి 30: తెలంగాణ రాష్ట్రంలోనే పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత సన్నిధిలో జరిగే మాఘ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి  మంగళవారం రోజున జరిగే మాఘ అమావాస్య కు పుణ్యక్షేత్రమైన ఏడుపాయలకు భారీ సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఆలయ సిబ్బంది పుణ్యస్నానాలకు ఇబ్బందులు తలెత్తకుండా    అమ్మవారి ఆలయం ఎదుట భక్తుల స్నానాల కోసం షవర్ బాత్ లను ఏర్పాటు చేస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కల్పిస్తున్నారు మహాశివరాత్రి పర్వదినం కన్నా నెల రోజులు ముందు అమ్మవారి సన్నిధిలో మాఘ అమావాస్య ఉత్సవాలు జరుగుతాయి మాఘ అమావాస్య కు ఒక రోజు ముందే దూర ప్రాంతాల ప్రజలు అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు మంజీరా నదిలో పుణ్యస్నానాలాచరించి అమ్మవారిని దర్శించుకుంటారు సుదూర ప్రాంతం భక్తుల సౌకర్యార్థం మెదక్ డిపో నుండి అమ్మవారి సన్నిధికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నది రాష్ట్రంలోనే ఏటా రెండుసార్లు ఉత్సవాలు జరిగే ఏకైక ఆలయం గా ఏడుపాయలకు పేరు ఉంది ఇక్కడ మాఘ అమావాస్య ఉత్సవాలతో పాటు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహా జాతర జరగడం ఆనవాయితీ ఏడాదిలో రెండు ఉత్సవాలు జరిగే అతిపెద్ద ఆలయంగా ఏడుపాయల కు పేరుంది అమావాస్య నుండి శివరాత్రి వరకు ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది          ..  పుణ్య స్నానాలకు ఏర్పాట్లు పూర్తి .. భక్తుల పుణ్య స్నానం దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏడుపాయల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో సార శ్రీనివాస్ స్పష్టం చేశారు

Post a Comment

0 Comments

Ad Code