*గాంధీజీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన పోలీసు అధికారులు సిబ్బంది*
వాస్తవ తెలంగాణ/మెదక్ ప్రతినిధి జనవరి30: భారత స్వతంత్ర పోరాటంలో ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరిస్తూ గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా యెస్.పి. రోహిణి ప్రియదర్శిని ఆదేశానుసారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గాంధీజీ ఫోటోకు పూలమాలవేసి నివాళులు అర్పించినారు. భారత స్వతంత్ర పోరాటంలో ప్రాణాలర్పించిన మహనీయుల అమరవీరులు త్యాగాలను స్మరిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఉదయం 11:00 గంటలకు పోలీస్ ప్రధాన కార్యాలయ,పోలీస్ స్టేషన్ల ఆవరణలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా యెస్.పి మాట్లాడుతూ....నేటి మన స్వతంత్రం, స్వతంత్ర సమరయోధులు అసమాన త్యాగఫలం, నేటి మన స్వేచ్ఛ వీరుల మహా ప్రసాదం, దేశ స్వాతంత్య్ర కొరకు త్యాగాలు చేసిన అమర వీరులకు మనమెల్లవేళలా ఋణపడి ఉండాలని, ప్రతి ఒక్కరూ శ్రమించడమూ, సేవా దృక్పథమూ, ఆధ్యాత్మిక దృక్కోణమూ మన జీవితంలో ప్రధానాంశాలు అంశాలుగా ఉండాలని సూచించారు.
0 Comments