అక్రమ నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు; కలెక్టర్ హరీష్
నర్సాపూర్, వాస్తవ తెలంగాణ:
అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హరీష్ అన్నారు, శుక్రవారం నర్సాపూర్ లోని ఆర్డీవో కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని నర్సాపూర్, రామయంపేట్,మెదక్,తూప్రాన్ మున్సిపాలిటీలలోని పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. నర్సాపూర్ లో పెండింగ్ లో ఉన్న మున్సిపాలిటీ నిర్మాణ పనులు బస్ డిపో,ఇంటిగ్రేటెడ్ మార్కెట్,డంపింగ్ యార్డ్,వైకుంఠధామం,డబల్ బెడ్ రూమ్ లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆయన కోరారు.అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చి వేయడం జరుగుతుందని ఆయన అన్నారు. విధుల్లో అలసత్వం వహించిన అధికారులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్,రమేష్,ఆర్డిఓ వెంకట ఉపేందర్ రెడ్డి,జిల్లా స్థాయి అధికారులు మున్సిపల్ కమిషనర్ చామందేశ్వరి తదితరులు పాల్గొన్నారు,
0 Comments