వాస్తవ తెలంగాణ న్యూస్ మంచిర్యాల జిల్లా,8.జనవరి.
మంచిర్యాల జిల్లా కేంద్రములోని, ఇస్లాంపూర్, హనుమాన్ నగర్ (ఐ సి డి ఎస్), అంగన్ వాడి కేంద్రము ను సందర్శించి, కేంద్రములో ఉన్న తల్లులు, ఆయా, అంగన్ వాడి టీచర్, సరోజన ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్న ఫాండామిక్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పిల్లలందరికి వైద్య పరీక్షలు నిర్వహించి,
పిల్లల మానసిక ఎదుగుదల, ఉండవలసిన బరువు లేకపోవటం, టీ.బి తదితర వ్యాధులు రాకుండా,పుట్టుక లోపాలు, సరయైన సమయములో టీకాలు తీసుకోవటములో జాగ్రత్తలు, పిల్లల ఆరోగ్యవిషయాలపై అవాలంభించవలసిన పద్ధతులు, పిల్లలకు వచ్చే వివిధ అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలకు,
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, జిల్లా ఆరోగ్య కేంద్రానికి, ఇంకా అవసరాన్ని బట్టి ఆదిలాబాద్ లో గల రిమ్స్ కు తీసుకు వెళ్ళవలసి ఉంటుందని, చిన్నారుల ఆరోగ్య పరిస్థితుల పై ప్రత్యేకంగా ద్రుష్టి ఉంచాలని పిల్లలకు ఆనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు వైద్యుల సూచన మేరకు మందులు వాడాలని, అంగన్ వాడి కార్యకర్తలకు, చిన్నారుల తల్లులకు సూచించారు. ఈ కార్యక్రమములో ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్. వొళ్ళలా రజిత, ఫార్మాసిస్ట్.సావిత్రి, ఏ ఎన్ ఎం. స్రవంతి లు పాల్గొన్నారు......
0 Comments