Wanted Reporters

Wanted Reporters

హుజూరాబాద్ గడ్డ పైన కాషాయం జెండా ఎగరడం ఖాయం రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు సి అంజిరెడ్డి

 హుజూరాబాద్ గడ్డ పైన కాషాయం జెండా ఎగరడం ఖాయం రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు సి అంజిరెడ్డి



రామచంద్రాపురం, తెలంగాణ సాక్షి న్యూస్:-


హుజూరాబాద్ నియోజకవర్గంలో  బిజెపి నాయకులు  మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్రర్ ప్రజా జీవన యాత్ర పేరుతో తలపెట్టిన  పాదయాత్ర కమలాపూర్ మండల్ బత్తిన వారి పల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించిన సందర్భంగా  దుబ్బాక ఎమ్మెల్యే  రఘునంధన్ రావు, తో కలసి  రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు  సి.అంజిరెడ్డి , పాదయాత్రకు మద్దతుగా యాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి పార్టీ సీనియర్ నాయకులు అంజి రెడ్డి మాట్లాడుతూ హుజురాబాద్ ప్రజలు ఈటెల రాజేందర్ వైపు ఉన్నారని పాదయాత్ర మొదటి రోజే ప్రజలు బ్రహ్మరథం పట్టారని మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులతో తిలకం దిద్ది గ్రామాల్లోకి ఆహ్వానిస్తారని అన్నారు  ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఈటెల రాజేందర్ గెలుపు ను ఎవరు ఆపలేరని హుజురాబాద్ గడ్డ పైన కాషాయం జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో  రామచంద్రపురం నాయకులు నందరేడ్డి,రాజేష్, మురళి,సల్మాన్,మధుసూధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code