నీడను కోల్పోయిన కార్యకర్తకు నీలం మధు ముదిరాజ్ ఆర్థిక సాయం అందజేత
గుమ్మడిదల తెలంగాణ సాక్షి న్యూస్:-
గుమ్మడిదల మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త యూనిస్ అద్దె ఇల్లు కరెంట్ సర్క్యూట్ అవడంతో కూలిపోయింది. విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ నాయకుడు చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీల మధు ముదిరాజ్ యువసేన సభ్యులు బాధితుడికి 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు నీలం మధు ముదిరాజ్ యువసేన అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మండలం ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గ్యారాల మల్లేష్, వార్డు సభ్యుడు రాము,యువసేన సభ్యులు రాజు, సాయి, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

0 Comments