*మంబాపూర్ ఏ ఐ టి యు సి అనుబంధ సంఘంను రద్దు చేస్తూ జిల్లా కమిటీ తీర్మానం*
*-ఏ ఐ టీ యూ సీ జిల్లా కార్యదర్శి బోయిన ప్రసాద్*
గుమ్మడిదల, తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామానికి సంబంధించిన లక్ష్మీనరసింహ హమాలీ సంఘం ను ఏఐటీయూసీ అనుబంధ సంస్థ నుండి తొలగిస్తూ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బోయిన్ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా సిపిఐ పార్టీ ఆఫీసులో ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుమ్మడిదల మండలంలోని మంబాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీనరసింహస్వామి అమాలి కార్మిక సంఘాన్ని ఏఐటియుసి అనుబంధం నుండి పూర్తిగా రద్దు చేశారు. లక్ష్మీనరసింహ హమాలీ కార్మిక సంఘానికి ఏఐటీయూసీ కి ఎలాంటి సంబంధం లేదని సమావేశంలో తీర్మానించారు. హమాలీ కార్మికులు ఏఐటియుసి అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శులను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటమే కాకుండా క్రమశిక్షణా చర్యలను ఉల్లంఘించి కంపెనీ యజమానులపై దుర్భాషలాడటం అలాగే ఏఐటియుసి కార్మిక సంఘానికి సంబంధించిన ఏ ఐ టి యు సి జిల్లా అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు ఎలాంటి సంబంధం లేకుండానే ఐడెంటిటీ కార్డులు తయారు చేసుకోవడం అలాగే కంపెనీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేసుకోవడం జిల్లా కమిటీలకు తెలియకుండానే జెండాలు ఎగుర వేసుకోవడం అలాగే జండాను తెచ్చుకోవడం ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ సంఘాన్ని పూర్తిగా రద్దు చేయాలని సమావేశంలో జిల్లా కమిటీ తీర్మానించింది. అలాగే రాష్ట్ర నాయకుల పేరు చెప్పుకొని మాకు రాష్ట్ర నాయకుల అండదండలు ఉన్నాయని అబద్ధాలు చెప్పుకుని ఇష్టానుసారంగా జిల్లా నాయకులను తిట్టడం యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జిల్లా నాయకత్వం కూడా రాష్ట్ర కమిటీకి పూర్తి వివరాలు అందజేయడంతో రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు జిల్లా నాయకత్వం నిర్ణయాల మేరకు కార్మిక సంఘాన్ని పూర్తిగా రద్దు చేశారు. ఇకపై ఏఐటియుసి పేరు చెప్పుకుని ఏ పని చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని ప్రసాద్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భీమ్రావు పాటేిల్, సహాయ కార్యదర్శి ఎం సిద్ధమా, వెంకట రాజ్యం, లక్ష్మి పార్వతి తదితరులు పాల్గొన్నారు.

0 Comments