గుమ్మడిదల, తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలానికి చెందిన పత్రిక జర్నలిస్ట్ జీవరత్నం కుటుంబం కరోనా కు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ నాయకులు చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ యువసేన సభ్యులు ఆయన కుటుంబాన్ని పరామర్శించి, ఎన్ ఎం ఎం తరఫున స్థానిక మండల ముదిరాజ్ అధ్యక్షుడు గ్యారల మల్లేష్ ,ఉప సర్పంచ్ మొగులయ్య తో కలిసి మూడువేల ఆర్థిక సహాయం తో పాటు 25 కేజీల బియ్యం నిత్యవసర వస్తువులు, పండ్లు, కాస్మోటిక్స్ శానిటైజర్ మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబం మొత్తం త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల సంఘం అధ్యక్షులు డి. నర్సింలు, వార్డు సభ్యులు రాము, ముదిరాజ్ నాయకులు బిక్షపతి పూజారి రాజు తదితరులు పాల్గొన్నారు.

0 Comments