ఊట్ల గంగమ్మ పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్
జిన్నారం తెలంగాణ సాక్షి న్యూస్:-
జిన్నారం మండలం ఊట్ల గ్రామ మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా వర్షాలు సమృద్ధిగా కురియాలి అన్న సంకల్పంతో గ్రామ పెద్ద చెరువు వద్ద నిర్వహించే గంగమ్మ తల్లి పూజలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ భగవంతుడి దయతో ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడనున్నాయని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్తు, సకాలంలో ఎరువులు విత్తనాలు అందిస్తూ రైతన్నకు వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రాజేష్, సహకార సంఘం అధ్యక్షులు మహేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



0 Comments