*- కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ*
*ఆరో వార్డు కౌన్సిలర్ గుండ్ల సుజాత మహేందర్ రెడ్డి*
బొల్లారం తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో హరీష్ రావు జన్మదిన వేడుకలను టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా జిన్నారం మాజీ ఎంపీపీ కోలన్ రవీందర్ రెడ్డి వివాహ వేడుకల ను కూడా పురస్కరించుకుని ఈ సందర్భంగా మున్సిపల్ ఆరో వార్డు కౌన్సిలర్ గుండ్ల సుజాత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హరీష్ రావు జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. హరీష్ రావు ప్రజా నాయకుడు అని ఆమె కొనియాడారు. కరోనా కష్టకాలంలో చేయూత ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆరో వార్డు బాలాజీ నగర్ లోని దాదాపు 30 కుటుంబాలకు 10 రకాలైన నిత్యావసర సరుకులను అందజేసినట్టు తెలిపారు.

0 Comments