పటాన్చెరు తెలంగాణసాక్షి న్యూస్:-
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిలతో కలిసి మంత్రి హరీష్ రావుకి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేసే మంత్రి హరీష్ రావు ఆయురారోగ్యాలతో కలకాలం ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆయన అభిలషించారు.

0 Comments