*రసాయన విషవాయువుల విడుదలతో గ్రామస్తులు ఉక్కిరి బిక్కిరి*
గుమ్మడిదల, తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలో ని సైమెడ్ పరిశ్రమ నుండి రసాయన విష వాయువులను విడుదల చేయడంతో సమీపంలోని ప్రజలు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి కి గురయ్యారు. ఈ విషయమై స్థానిక సర్పంచ్ రాజశేఖర్ పరిశ్రమ యాజమాన్యంతో చర్చించారు. సమీప గ్రామానికి చెందిన ప్రజలు పరిశ్రమ ముందు ఆందోళన చేపట్టారు. విషయాలు వదులుతూ ఉండడంతో ప్రాణాపాయం ఉందని పి సి బి అధికారులకు పరిశ్రమపై ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పిసిబి అధికారులు పరిశ్రమపై తగిన విధంగా చర్యలు తీసుకుంటామని సూచించడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.

0 Comments