Wanted Reporters

Wanted Reporters

రేవంత్ రెడ్డి నియామకం పట్ల సంబరాలు చేసుకున్న పార్టీ శ్రేణులు

 *రేవంత్ రెడ్డి నియామకం పట్ల సంబరాలు చేసుకున్న పార్టీ శ్రేణులు*



గుమ్మడిదల తెలంగాణ సాక్షి న్యూస్:-

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో నీ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు టపాకాయలు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు వీరారెడ్డి మాట్లాడుతూ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడం హర్షించదగ్గ విషయమన్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. నియామకా నికి సంతోషం వ్యక్తం చేస్తూ నాయకులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొంత్తపల్లి ఎంపిటీసి నాగేందర్ గౌడ్, జై శంకర్ గౌడ్, దొమడుగు ఎంపిటీసి గోవర్ధన్ గౌడ్,  ప్రతాప రెడ్డి, నర్సింగ్ రావు, మురళి, ఆంజనేయులు, పెంటా రెడ్డి, సురేందర్ రెడ్డి, బాల్ రాజ్, మల్లేష్ యాదవ్, మహిపాల్ రెడ్డి, నవీన్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కె ఎస్ జి యువసేన సభ్యులు  తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments

Ad Code