పటాన్ చేరు తెలంగాణ సాక్షి న్యూస్:-
నిరుపేదలకు కార్పోరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి వరం లాగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామానికి చెందిన హనుమంతు గత కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోగా లక్ష రూపాయల విలువైన ఎల్ వో సి మంజూరు అయ్యింది. ఈ మేరకు శనివారం హనుమంతు కు ఎమ్మెల్యే జీఎంఆర్ ఎల్వోసీ అందజేశారు.

0 Comments