Wanted Reporters

Wanted Reporters

విద్యుదాఘాతానికి ఆవు బలి

 *విద్యుదాఘాతానికి ఆవు బలి*

గుమ్మడిదల, తెలంగాణ సాక్షి న్యూస్:-



సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో ఓ మూగ జీవి విద్యుదాఘాతానికి బలైంది. దోమడుగు గ్రామానికి చెందిన సత్తయ్య ఆవు గర్భం తో వుందని  విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మృతి చెందిందని బాధితులు లబోదిబోమంటున్నారు. ఇలాంటి సంఘటన రెండోసారి జరిగిందని దొమడుగు స్థానిక ఎంపిటిసి గోవర్ధన్ గౌడ్, రైతుతో కలిసి  ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో అధికారులు స్పందించి ఉంటే మూగజీవాలు ప్రాణాలను కాపాడేవారం అన్నారు. 15నుంచి 20 సంవత్సరాల క్రితం వేసిన వైర్లు పూర్తిగా తప్పు పట్టడంతో మరమ్మతులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారని ఎంపీటీసీ అన్నారు. విద్యుత్ శాఖ మొండి వైఖరిని నిరసిస్తూ కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇకనైనా సకాలంలో సమస్యలను గుర్తించి పెను ప్రమాదాల నుంచి జీవాలను,ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు...

Post a Comment

0 Comments

Ad Code