*1000 మంది చిన్నారులకు బిర్యాని ప్యాకెట్లు మాస్కులు పంపిణీ*
తెలంగాణ సాక్షి సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ బీజేపీ నాయకుడు, కేజేఆర్ ట్రస్ట్ ఫౌండర్ ఆనంద్ క్రిష్ణ రెడ్డి పారిశ్రామిక వాడలోని వలస కార్మికుల పిల్లలకు, కార్మిక కుటుంబాలకు వెజ్ బిర్యాని ప్యాకెట్లు పంపిణీ చేశారు. తన పుట్టినరోజు సందర్బంగా బొల్లారం మున్సిపాల్లో 1000 మందికి వెజ్ బిర్యాని ప్యాకెట్లు, మాస్కు లు అందజేసినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కష్టాల్లో ఉన్న పేదవారికి ట్రస్టు తరఫున సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

0 Comments