Wanted Reporters

Wanted Reporters

జిన్నారం మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిన్నారం మండల ఎంపీపీ రవీందర్



జిన్నారం తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా జిన్నారం  మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్  జిన్నారం మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం పూర్తిగా ఇటీవల కురిసిన వర్షాలకు మొలకెత్తిన ధాన్యాన్ని మంగళవారం స్థానిక ఎంపీపీ రవీందర్ గౌడ్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డితో కలిసి పరిశీలించారు లారీలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఐకెపి సిబ్బంది సోమవారం దాన్యం లారీలు రాక తడిసి పోయిందని తెలపడంతో  మంగళవారం ఎంపీపీ సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని లారీలను అందుబాటులో ఉంచాలని రైస్ మిల్ యజమానులకు సూచించడంతో మంగళవారం ధాన్యం లారీల లో తరలించడానికి ఏర్పాటు చేశారు దీంతో ఇంకేమైనా ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు చూడాలని కోరారు ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దాసరి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేస్తుందని ప్రగల్భాలు పలకడం వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు మండల కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యం మొలకలెత్తి పరిస్థితి వచ్చిందంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అని ఆయన విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతి గింజను ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎల్లయ్య యనగండ్ల నరేందర్  సత్యనారాయణ ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments

Ad Code